Naga Chaitanya: ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న నాగచైతన్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రస్తుతం తారక్ దేవర మూవీలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే యంగ్ హీరో నాగచైతన్య కూడా తారక్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. చైతన్య తర్వాత మూవీ చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

చైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ప్రేమమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సవ్యసాచి మూవీ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. అయితే కార్తికేయ2 సినిమాతో చందూ మొండేటి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. చైతన్యకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. చందూ మొండేటి అయినా నాగచైతన్య జాతకాన్ని మారుస్తారేమో చూడాల్సి ఉంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చైతన్య ఫిషర్ మెన్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. చందూ మొండేటికి ఈ సినిమాకు సంబంధించి 10 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. బలమైన ప్రేమకథగా గుజరాత్, పాకిస్తాన్ సముద్రాల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో (Naga Chaitanya) నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 100% లవ్ సక్సెస్ సాధించగా ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి. నాగచైతన్య తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాతో చైతన్య కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus