Naga Chaitanya: ఆ హీరోయిన్ తో చనువుగా మూవ్ అవుతున్న చైతన్య?

  • June 16, 2022 / 11:16 AM IST

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.ఈ విధంగా వీరిద్దరు విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఎవరి కెరీర్ గురించి వారు ఎంతో బిజీగా ఉన్నారు.సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందుకున్నారు.

ఇకపోతే నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాశి ఖన్నా సరసన థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో జరుపుకొని వచ్చే నెల విడుదల కాబోతుంది.అదే విధంగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మొట్టమొదటిసారిగా అమెజాన్ కోసం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగచైతన్య సరసన బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రలో నటించారు.

ఇకపోతే ఇప్పటికే ఈ వెబ్ సైట్ లిస్ట్ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే నాగార్జున హీరోయిన్ ప్రాచీ దేశాయ్, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి ట్రీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరితో కలిసి దిగిన ఫోటోని ప్రాచీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోని షేర్ చేస్తూ నాగచైతన్యతో కలిసి నటించడం వల్ల కొన్ని తెలుగు లైన్లను నేర్చుకోవడంతో పాటు ఎంతో రుచి కరమైన ఏషియన్ ఫుడ్ టేస్ట్ కూడా చేశానని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే నాగచైతన్యతో పాటు దర్శకుడుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో పై ఎంతోమంది స్పందిస్తూ హీరోయిన్ తో నాగచైతన్య చనువుగా ఉండడంతో పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాగచైతన్య నెగిటివ్ పాత్రలో సందడి చేయనున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus