టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ఈ ఏడాది వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల గ్యాప్ లో నాగచైతన్య నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కావడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. నాగచైతన్య కెరీర్ పై కూడా ఈ సినిమాలు ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే పలువురు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల చెప్పిన కథకు కూడా ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విరాటపర్వం సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా దర్శకుడిగా వేణు ఊడుగుల తప్పేం లేదని కామెంట్లు వినిపించాయి. కమర్షియల్ కథలను ఎంచుకుంటే వేణు ఊడుగుల ఖాతాలో విజయాలు చేరతాయని ఫ్యాన్స్ భావించారు. మరోవైపు నాగచైతన్య సైతం కొత్త తరహా కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
వెంకట్ ప్రభు, పరశురామ్ డైరెక్షన్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య ఈ సినిమాల షూటింగ్ లు పూర్తైన తర్వాత వేణు ఊడుగుల డైరెక్షన్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాగచైతన్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే చైతన్య రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. నాగచైతన్య ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో నాగచైతన్య ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారో తెలియాల్సి ఉంది.