Naga Chaitanya, Aamir Khan: నాగ చైతన్య ఫ్యాన్స్ ముచ్చట.. ఆమిర్ సినిమాతోనే తీరాలి..!

నాగ చైతన్య.. టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు.ప్రస్తుతానికైతే నాని, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్.. వంటి వాళ్ళందరి కంటే ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. వరుసగా ఇతనికి 4 రూ.50 కోట్ల గ్రాస్ మూవీస్ ఉన్నాయి. కానీ రూ.100 కోట్ల(గ్రాస్) ముచ్చట మాత్రం ఇతనికి తీరడం లేదు. విజయ్ దేవరకొండకి ‘గీత గోవిందం’ రూ.100కోట్ల ముచ్చట తీర్చింది.కానీ చైతన్యకి మాత్రం తీరలేదు. ‘బంగార్రాజు’ వంటి మల్టీ స్టారర్ పోటీ లేకుండా విడుదలైనప్పటికీ చైతన్య ముచ్చట కానీ అతని ఫ్యాన్స్ ముచ్చట కానీ తీర్చలేకపోతుంది.

ఒక్క నాగ చైతన్య అనే కాదు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అఖిల్ వంటి వాళ్ళకి కూడా రూ.100 కోట్ల ముచ్చట లేదు. అయితే ఆమిర్ ఖాన్ మూవీతో అక్కినేని ఫ్యాన్స్ ముచ్చట తీరే అవకాశం పుష్కలంగా ఉంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగ చైతన్య గెస్ట్ రోల్ ప్లే చేసాడు. ఆమిర్ ఖాన్ ఫ్రెండ్ పాత్రలో చైతన్య కనిపించనున్నాడు. చైతన్య ఉన్నాడు కాబట్టి.. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

అంతేకాదు తెలుగులో నాగ చైతన్య పాత్ర నిడివి కూడా కాస్త ఎక్కువగా ఉంటుందట. హిందీలో అయితే అంత ఉండదు. బాలీవుడ్ మార్కెట్ కోసం చైతన్య.. ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. తెలుగులో అయితే చైతన్య వల్లే ‘లాల్ సింగ్ చద్దా’ ని రూ.8 కోట్లు పెట్టి కొనడానికి బయ్యర్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆమిర్ మూవీస్ కు ఇక్కడ రూ.2 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది. కాబట్టి.. ‘లాల్ సింగ్ చద్దా’ కనుక రూ.100కోట్లకి పైగా కలెక్షన్లు సాధిస్తే అక్కినేని ఫ్యాన్స్ ముచ్చట తీరుతుందన్న మాట.

అయితే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదల కానుంది. అదే టైములో ‘కె.జి.ఎఫ్2’ కూడా విడుదల కాబోతుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus