Naga Chaitanya: నేనెప్పుడూ డిస్ కనెక్ట్ అయిపోయాను.. చైతు కామెంట్స్ వైరల్!

అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఈయన ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పూర్తిగా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినిమా విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి వృత్తిపరమైన జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తానని అయితే ఈ రెండింటిని ముడిపెట్టి ఎప్పుడు చూడనని ఈ సందర్భంగా నాగచైతన్య వెల్లడించారు. అయితే తాజాగా నాగచైతన్య మరో ఇంటర్వ్యూలో పాల్గొని సోషల్ మీడియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను సోషల్ మీడియా నుంచి ఎప్పుడో డిస్ కనెక్ట్ అయ్యానని ఈయన తెలిపారు. నాకు ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉండడం చాలా బోరింగ్ గా ఉంటుందని,

ఇక నా సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వాటి గురించి పోస్ట్ చేయడం కంటే వాటి గురించి ఎక్కువ ఆసక్తిగా చదువుతానని ఈయన తెలిపారు. అలాగే ఇంటర్వ్యూలు ప్రతి చర్యలు కూడా చదువుతానని తెలిపారు. అయితే ఈ రెండింటిని ఎప్పుడు ముడి పెట్టి చూడనని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో ఎంతో విషపూరితమైనవని ఉన్నాయని వీటిలో మంచి ఏదో చెడు ఏదో చూసి వాటిని ఫిల్టర్ చేసి చూసుకోవడం ఎంతో మంచిది లేకపోతే సోషల్ మీడియా మనల్ని చాలా తప్పుడు మార్గంలోకి తీసుకు వెళ్తుందని

ఈ సందర్భంగా నాగచైతన్య సోషల్ మీడియా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక ద్వి భాష చిత్రంలో చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ద్వారా నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus