సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్న అనంతరం నెపోటిజం అనే పదం ట్విట్టర్లో ఇండియా వైడ్ భారీగా ట్రెండ్ అయ్యింది. అతన్ని చాలా వరకు ప్రాజెక్టుల నుండి బాలీవుడ్ పెద్ద స్టార్లు తప్పించారని, అన్ని భాషల సినీ పరిశ్రమల్లో నెపోటిజం అనేది ఉందని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ అంశం పై చాలా మంది హీరోలు రియాక్ట్ అయ్యారు. తాజాగా నాగ చైతన్య కూడా ఈ అంశం పై స్పందించాడు.
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్ల టైంలో నాగ చైతన్య వరుసగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్య్వూలు ఇచ్చాడు. ఆ టైంలో నెపోటిజం పై నాగ చైతన్య స్పందించాడు. అతను మాట్లాడుతూ… “నెపోటిజం ప్రభావం అనేది బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్లో పెద్దగా కనిపించదు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కాదు. దీని గురించి నన్ను అడిగినప్పుడల్లా నా అభిప్రాయం ఇదే. ఎందుకంటే మా తాత(అక్కినేని నాగేశ్వరరావు) గారు స్టార్. మా నాన్న(నాగార్జున) కూడా స్టార్.
చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం కచ్చితంగా నాపై పడుతుంది కదా! వారిని చూసి నేను కూడా నటుడు కావాలని ఆశపడ్డాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని నటుడిని అయ్యాను. అలా వారు చూపించిన దారిలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ జర్నీ అలాగే కొనసాగుతుంది.ఒకవేళ ఎప్పుడైనా ఓ సెల్ఫ్ మేడ్ స్టార్ సినిమా, నా సినిమా ఒకేరోజు విడుదలైతే…. వారి సినిమా రూ.100 కోట్లు సాధించి నా సినిమా రూ.10 కోట్లు సాధిస్తే.. అందరూ అతన్ని ప్రశంసిస్తారు.
ఇక దర్శక-నిర్మాతలు కూడా అతన్నే ముందుగా అప్రోచ్ అవుతారు. అయితే సినిమా ఫ్యామిలీ నుండి రావడం వల్ల నాకు బ్రేక్ ఈజీగానే దొరికింది.ఈ రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కొడుకు రేపు పెద్దయ్యాక అతడు కూడా హీరోనే అవుతాడు కానీ, నెపోటిజం పేరు చెప్పి అతనికి అడ్డు చెప్పగలరా” అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?