Naga Chaitanya, Raashi khanna: రాశి ఖన్నా కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది.. చైతూ ఓపెన్ కామెంట్స్!

నాగచైతన్య రాశిఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థాంక్యూ. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జులై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇకపోతే రాశి ఖన్నా చైతన్య ఒక చిట్ చాట్ లో పాల్గొని వీరి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ..

తాను రాశి ఖన్నా కలిసి రెండు సినిమాలలో నటించామని తెలిపారు. నా గురించి రాశిఖన్నాకు అన్నీ తెలుసు అలాగే తన ఇస్తా ఇష్టాలు గురించి నాకు తెలుసని చైతన్య తెలియచేశారు.ఇక సెట్లో రాశికన్నా ఎంతో చలాకీగా ఉండడమే కాకుండా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందని చైతన్య వెల్లడించారు. అదేవిధంగా షూటింగ్ విధానం సమయంలో ఇద్దరం ఒకరి ఇష్ట ఇష్టాల గురించి మాట్లాడుకుంటామని, ఇలా ఇద్దరం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటామని చైతన్య వెల్లడించారు.

ఇలా విరామ సమయంలో కెరియర్ గురించి మాట్లాడుకోవడం వల్ల ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలుసని చైతన్య వెల్లడించారు.ఈ విధంగా నాగచైతన్య రాశిఖన్నా గురించి తన గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగచైతన్య ఇప్పటికే బంగార్రాజు లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలోనే థాంక్యూ సినిమాతో కూడా మరో హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి భారీగా ప్రమోట్ చేస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.మరి సినిమా థియేటర్లో విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus