Naga Chaitanya: వెబ్ సిరిస్ కి నాగచైత్యన్య తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • November 28, 2023 / 10:54 AM IST

అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ రెండు హిట్లు, మూడు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది. టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో పెద్దగా విజయం సాధించలేదు. గతంలో దర్శకుడు కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ కూడా ప్రారంభమైంది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా ఈ వెబ్ సిరీస్‌తో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. దూత ట్రైలర్‌ను విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య ఎంత తీసుకున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. వివిధ నివేదికల ప్రకారం, దూత వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య 8 కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలుస్తోంది.

ఎన్నో సినిమాల్లో నటించి నటనలో మంచి పేరు తెచ్చుకున్న నాగ చైతన్య కి సినిమాల్లో సరైనా సక్సెస్ రాలేదని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ తో తప్పకుండా విజయం సాధిస్తాడని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా ట్రైలర్ దూత వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం (Naga Chaitanya) నాగచైతన్య . గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus