శేఖర్ కమ్ముల సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చిన్న పాయింట్ ని పట్టుకుని సినిమా మొత్తాన్ని తన స్క్రీన్ ప్లేతోనే మాయ చేయగల సమర్ధుడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవిలతో కలిసి లవ్ స్టోరీని చెప్పబోతున్నాడు. ఈ లవ్ స్టోరీ చాలా క్యూట్ గా ఉంటుందని , షూటింగ్ మొత్తం ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యిందని చిత్రయూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సాయిపల్లవి నాగచైతన్య చెవిలో ఏదో చెప్తూ ఉన్న పోస్టర్ ని చాలా ఇంట్రస్టింగ్ ప్రెజెంట్ చేస్తూ టీజర్ జనవరి 10వ తారీఖున వస్తోందని మూవీ టీమ్ ఎనౌన్స్ చేసింది.
అసలు సాయిపల్లవి నాగచైతన్య చెవిలో ఏం చెప్తోంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ సాయిపల్లవి ఏం చెప్పింది ? గెస్ చేయండి అంటూ తెగ షేర్లు చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి చాలా ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మా హార్ట్ మీరే అంటూ సాయిపల్లవిని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సినిమా టీజర్ రాకముందే సింపుల్ పోస్టర్ తో సినిమాపై క్యూరియాసిటీని నింపాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
టీజర్ లో సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ని కూడా రివీల్ చేస్తారట. ఈ సినిమా చాలా నేచరల్ గా ఉండబోతోందని, సహజసిద్ధమైన ఒరిజినల్ ప్రేమకథగా సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తుందని అంటోంది మూవీటీమ్. నాగచైతన్య యాక్టింగ్ కి వందకి వంద మార్కులు ఈ సినిమాలో పడతాయని, అంతగొప్పగా నటించాడని చెప్తున్నారు. అదీ మేటర్.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!