Naga Chaitanya, Samantha: ఆ సినిమాలే చైసామ్ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు చైతన్యకు ఇటు సమంతకు భారీస్థాయిలో గుర్తింపు ఉంది. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ద్వారా అభిమానులకు సమంత దగ్గరయ్యారు. ఈ వెబ్ సిరీస్ వల్ల సమంత పేరు ఊహించని స్థాయిలో మారుమ్రోగింది. అయితే చైతన్య సమంత ఒక విషయంలో ఒకే బాటలో నడుస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సక్సెస్ సాధించి తన పాత్రకు మంచి గుర్తింపు వస్తే మరిన్ని బాలీవుడ్ సినిమాలలో నటించాలని చైతన్య భావిస్తున్నారు. సమంత నటించిన యశోద షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అటు సమంత ఇటు చైతన్య ఒకే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకే సమయంలో సమంత, చైతన్య తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.

ఈ సినిమాలతో చైతన్య, సమంతలకు వేర్వేరుగా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. విడాకుల తర్వాత చైతన్య కొన్ని నెలల గ్యాప్ లోనే వరుసగా సినిమాలను విడుదల చేస్తుండగా సమంత సినిమాలు మాత్రం ఆలస్యంగా విడుదలవుతున్నాయి. ఒకే సమయంలో సమంత, నాగచైతన్య బాలీవుడ్ లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం యాదృచ్ఛికంగా జరిగినా వీళ్లిద్దరికీ తమ తర్వాత ప్రాజెక్ట్ లతో మంచి ఫలితాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హిందీలో చైతన్య, సమంత తమను తాము ప్రమోట్ చేసుకుంటుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా విజయాలను అందుకుంటే వీళ్లిద్దరి రేంజ్, మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఇద్దరి రెమ్యునరేషన్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయని సమాచారం అందుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus