Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య సెంటిమెంట్ ఇదే!

  • July 15, 2022 / 03:06 PM IST

అక్కినేని హీరో నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా నాగచైతన్య ఖాతాలో వరుసగా విజయాలు చేరాయి. థాంక్యూ సినిమాతో చైతన్య మరో సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతన్య వరుస విజయాలతో జోరుమీదుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రాశీఖన్నా, మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మించడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి.

థాంక్యూ సినిమాలో నాగచైతన్య మూడు పాత్రల్లో నటిస్తుండగా జీవితంలోని మూడు దశలను ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించనున్నట్టు సమాచారం అందుతోంది. నాగచైతన్య ఫ్యాన్ చైతూ కొత్త మూవీ రిలీజైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హంగామా చేస్తానని చైతన్యకు తెలిపారు. ఈసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు చైతన్య కూడా రావాలని ఆ అభిమాని కోరారు. ఫ్యాన్ కామెంట్ కు చైతన్య స్పందిస్తూ నాకు థియేటర్లకు వెళ్లడం నచ్చదని వెల్లడించారు.

ఈ విధంగా థియేటర్లకు వెళ్లకపోవడం నా సెంటిమెంట్ అని చైతన్య కామెంట్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ చైతన్యను థియేటర్ కు రావాలని కోరాలని నేను అనుకున్నానని కానీ సెంటిమెంట్ అని చెప్పడంతో చైతన్యను అడగాలనే ఆలోచన నాకు లేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు. తాజాగా విడుదలైన థాంక్యూ ట్రైలర్ లో నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సినిమాసినిమాకు నాగచైతన్యకు క్రేజ్ పెరుగుతుండగా చైతన్య రెమ్యునరేషన్ సైతం ఊహించని స్థాయిలో ఉందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు చైతన్య 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus