Naga Chaitanya: ఆ స్టార్ హీరోయిన్ల పై నాగ చైతన్య కామెంట్స్ వైరల్..!

అక్కినేని నాగ చైతన్య సాధ్యమైనంతవరకు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటాడు. చాలా కామ్ గోయింగ్ పర్సన్. తన సినిమాలు…వాటి ప్రమోషన్లు తప్ప.. అతనికి వేరే ధ్యాస ఉండదు. కానీ సమంతతో విడిపోయినప్పటి నుండి నాగ చైతన్యకి తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి.పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అనగానే బాలీవుడ్‌ మీడియా మరింత ఆసక్తి చూపిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే చైతన్య ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మూవీ పెద్దగా ఆడలేదు.ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్‌ 11న విడుదలైంది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే చైతన్య పోషించిన బాలరాజు పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ కోసం బాలీవుడ్లో చై ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. తరచూ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ క్రమంలో అతనికి ఎదురైన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇచ్చాడు చైతన్య.

భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోగా చేయాల్సి వస్తే ఏ హీరోయిన్స్‌తో కలిసి నటించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న అతనికి ఎదురైంది. అందుకు అతను అతను బదులిస్తూ.. ఆలియా భట్‌, కత్రీనా కైఫ్‌, ప్రియాంక చోప్రాల పేర్లు చెప్పాడు. ముఖ్యంగా ఆలియా భట్‌ నటన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన చైతన్య ‘ఐ లవ్‌ హర్‌ యాక్టింగ్‌’ అంటూ ప్రశంసించాడు.

‘ఆమెతో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’ అంటూ చెబుతున్నాడు ఈ కుర్రాడు. ‘మనం’ కనుక హిందీలో రీమేక్‌ తన పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు. అలాగే సెలబ్రెటీ క్రష్‌ ఎవరని అడగ్గా.. మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ అంటూ చెప్పుకొచ్చాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus