Naga Chaitanya, Samantha: సమంత గురించి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన చైతన్య?

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని విడిపోయి దాదాపు పది నెలలు కావస్తున్న ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా వీరి పెళ్లి విడాకులు గురించి నిత్యం ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఇకపోతే నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఎక్కడ సమంత గురించి మాత్రం ప్రస్తావించలేదు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్యకు ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆయన నోరు విప్పక తప్పలేదు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు యాంకర్ నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు కనుక సమంత మీకు ఎదురుపడి కనిపిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది.

నాగచైతన్యకు ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో ఆయన కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. సమంత తనకు ఎదురుపడితే తను హాయ్ అని చెబుతా అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా సమంత గురించి నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే తన గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూడా తన వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితం పై ప్రభావం చూపకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని ఈయన తెలిపారు.

చాలామంది వృత్తిపరమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితంతో ముడి పెడుతూ ఉంటారు. అయితే తనకు అలా రెండింటిని కలిపి చూడడం ఇష్టం లేదని నాగచైతన్య వెల్లడించారు. ఇకపోతే లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య మొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus