ఆ రీమేక్ కు నో చెప్పిన నాగ చైతన్య…!

నాగ చైతన్య ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసింది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజునే..! వాసు వర్మ ని కూడా డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘జోష్’ చిత్రాన్ని రూపొందించి.. చైతూ ని లాంచ్ చేసాడు. కానీ ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. నిజానికి చైతూతో ‘కొత్త బంగారు లోకం’ సినిమా రూపొందించాలి అని అనుకున్నాడు దిల్ రాజు … కానీ ఆ తర్వాత స్టార్ హీరో కొడుకుతో ఇలాంటి క్లాస్ సినిమా ఏంటి అని మనసు మార్చుకున్నాడట.

ఇక ఎలాగూ ప్లాప్ ఇచ్చాం…చైతూకి ఓ మంచి హిట్ ఇచ్చి .. ఆ లోటుని తీర్చెయ్యాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్నో కథలు చైతూ వద్దకు పంపాడట దిల్ రాజు. కానీ చైతూకి అవేమీ నచ్చలేదట. ఈ క్రమంలో ఈమధ్యే ఓ కొత్త డైరెక్టర్ స్క్రిప్ట్ ను పంపితే ఆది నచ్చిందని చైతూ చెప్పాడట. కానీ గతంలో ‘జోష్’ విషయంలో కొత్త డైరెక్టర్ తో సినిమా చేసి తప్పు చేసాము ఈసారి వద్దు అని దిల్ రాజుకి నేరుగానే చెప్పాడట చైతూ.

తను చెప్పింది నిజమే..! ‘ ‘జోష్’ కథ అందరికీ నచ్చింది కానీ డైరెక్షన్ బాలేదు’ అనే రివ్యూ లే వచ్చాయి. ఇక ‘దడ’ ‘బెజవాడ’ ‘యుద్ధం శరణం’ అన్నీ ఫాప్ లే అయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ హిట్ ‘బథాయ్ హో’ను రీమేక్ చేద్దాం.. అని చైతూకి చెప్పాడట దిల్ రాజు. కానీ దీనికి కూడా చైతూ నో చెప్పాడని … దాంతో దిల్ రాజు షాక్ అయ్యాడని తెలుస్తుంది. మరి మళ్ళీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి..!

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus