‘వెంకీమామ’ గురించి నాగ చైతన్య ముచ్చట్లు..!

  • February 14, 2020 / 01:48 PM IST

నేను 100 శాతం డైరెక్టర్స్ హీరోనే.. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను. నా దగర్నుండీ ఎంత నటన వాళ్ళు రాబట్టుకోవాలి అనుకుంటే .. అంత ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను అంటున్నాడు మన యువ సామ్రాట్ నాగ చైతన్య. తాజాగా ‘వెంకీ మామ’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మరో రెండు రోజుల్లో.. అంటే డిసెంబర్ 13 న ‘వెంకీమామ’ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు.

మీ మామయ్య వెంకటేష్ గారితో మొదటిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.. ఆయన నుండీ ఏం నేర్చుకున్నారు?

రియల్ లైఫ్ లో నేను, వెంకీ మామ బాగా సైలెంట్ గా ఉంటాం. అయితే ఆయన పై అందరికీ ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి.. ఓ వ్యక్తిగా, నటుడిగా ఆయన దగ్గర్నుండీ చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా అయన నుండీ కామెడీ టైమింగ్, ఎమోషన్స్ … ఎలా పండించాలన్నది నేర్చుకున్నాను.

మీ మావయ్య గారి బ్యానర్ లో చేయడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నారు?

సురేష్ బాబు గారు నాకు 10 స్క్రిప్ట్ ల వరకూ పంపించారు. సోలో హీరోగా.. ఫ్యామిలీ సబ్జెక్టు లు చేయమని అడిగారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్స్ ఏమీ సెట్ అవ్వలేదు. ఇన్నాళ్ళకి ‘వెంకీ మామ’ సెట్ అయ్యింది. సో ఫుల్ హ్యాపి.

‘వెంకీ మామ’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

చదువు కోసం సిటీకి వెళ్ళిన ఓ కుర్రాడు.. అక్కడే పెరిగి, సెలవులకి ఊరికి వచ్చే అబ్బాయిగా నేను కనిపిస్తాను. అలాంటి కుర్రాడు ఎందుకు ఆర్మీలో చేరాల్సి వచ్చింది అనేది మూవీలోని అసలు ట్విస్ట్.

ఈ చిత్రంలో జాతకాల్ని నమ్మకూడదు అనే విధంగా చూపించారా?

అలా ఏమీ లేదు.. ‘న్యూట్రల్’ గా చూపించాము. అంతకు మించి ఎక్కువ చెప్పకూడదు.. మీరు సినిమా చూసి తెలుసుకోండి.

ఇది పక్కా మాస్ మూవీనా..?

అలా ఏమీ లేదు.. ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది.

డెబ్యూ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికి ఈ మధ్య మీరు ఒప్పుకోవట్లేదు అని విన్నాం.. ఎందుకు?

అలా ఏమీ లేదు.. నేను కంప్లీట్ డైరెక్టర్స్… యాక్టర్ ని..! వాళ్ళు నా దగ్గర్నుండీ ఎంత పెర్ఫార్మన్స్ రాబట్టుకుంటే.. అంతా ఇవ్వడానికి నేను రెడీ. కొత్త డైరెక్టర్ లు అయితే చైతన్య సీనియర్ హీరో కదా అని.. మొహమాటం కొద్దీ ఎక్కువ టేక్ లు అడగరేమో అని నా ఫీలింగ్. అదే శేఖర్ కమ్ముల వంటి సీనియర్ డైరెక్టర్ లు.. మొహమాటం లేకుండా ఎన్ని టెక్ లు అయినా అడిగి చేయించుకుంటారు. అందుకే ఇప్పుడు లైన్ గా అలాంటి వాళ్ళతో చేస్తున్నాను తప్ప.. కొత్త డైరెక్టర్స్ తో చేయను అని చెప్పట్లేదు.

రాశీ ఖన్నాతో ‘మనం’ చేశారు.. మళ్ళీ ‘వెంకీమామ’ చేశారు.. ఆమెతో పనిచేయడం ఎలా అనిపించింది?

‘మనం’ చిత్రంలో రాశీ తో రెండు నిమిషాలు ఉన్న సీన్ మాత్రమే చేశాను. ఈ ఐదేళ్లలో ఆమె నటన పరంగా.. క్రేజ్ పరంగా బాగా ఎదిగింది. ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె నటన బాగా నచ్చింది. ఈ చిత్రంలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది.

‘ప్రేమమ్’ … ‘వెంకీమామ’ .. ఈ రెండు సినిమాలకి ఆయనలో ఏం మార్పులు వచ్చాయి?

‘ప్రేమమ్’ సినిమా టైంలో వెంకీమామ తో ఒక రోజంతా షూటింగ్ లో పాల్గొన్నాను. బాగా ఎంజాయ్ చేశాను. అప్పటి నుండీ చాలా మంది ఎప్పుడెప్పుడు వెంకటేష్ గారితో కలిసి సినిమా చేస్తారు అని అందరూ ఎంతో క్యూరియాసిటీతో అడుగుతున్నారు. ఇప్పటికి కుదిరింది.. ఈసారి మరింత ఎక్కువగా ఎంజాయ్ చేశాను.

‘వెంకీ మామ’ స్క్రిప్ట్ నాగార్జున గారు.. సమంత గారు విన్నారా?

లేదండీ.. వినలేదు..!

శేఖర్ కమ్ముల గారి సినిమా ఎంత వరకూ వచ్చింది?

40 శాతం కంప్లీట్ అయ్యింది. ‘లవ్ స్టోరీ’ అని వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు.. చూడాలి.. చివరికి ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి..!

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి?

ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు.. శేఖర్ కమ్ముల గారి సినిమా పూర్తయిన తర్వాత చూడాలి..!

– Phani Kumar

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus