Naga Chaitanya: ఆ చిన్నారులకు అండగా నిలిచిన చై.. మంచి మనస్సంటూ?

  • November 17, 2023 / 07:31 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే నాగచైతన్య తాజాగా మంచి మనస్సును చాటుకున్నారు. హైదరాబాద్ నగరంలోని సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ లో చైతన్య సందడి చేశారు. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో కొంత సమయం గడిపిన నాగచైతన్య చిన్నారుల ముఖాల్లో సంతోషాన్ని నింపారు.

చిన్నారులకు బహుమతులను ఇచ్చి నాగచైతన్య మంచి మనస్సును చాటుకున్నారు. చిన్నారులతో చైతన్య ఆటలు ఆడటంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్స్ చేశారు. చైతన్య చిన్నారులతో కలిసి సందడి చేసిన ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చైతన్య హాజరు కావడం వల్ల చైల్డ్ కేర్ సెంటర్ లో పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొంటున్న చైతన్య మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది నాగచైతన్య (Naga Chaitanya) కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య నటిస్తున్నారు. ప్రేమమ్, సవ్యసాచి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. చందు మొండేటి కార్తికేయ2 సక్సెస్ తో ఫామ్ లో ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నాగచైతన్య తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus