Bangarraju Teaser: ఆకట్టుకుంటున్న జూనియర్ బంగార్రాజు..!

Ad not loaded.

యువ సామ్రాట్ నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో తండ్రి కింగ్ నాగార్జున అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బంగార్రాజు’ నుండీ అతని పాత్రని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’ కి ఇది సీక్వెల్. ఈ మూవీలో బంగార్రాజు మనవడి పాత్రలో చైతన్య కనిపించబోతున్నాడు.తన తాతగారి ఆభరణాలను ధరించడమే కాకుండా.. తన తాతగారి నడక,టీవీ వంటివి పుణికిపుచ్చుకున్నట్టు నాగ చైతన్య ఎంతో రాజసంగా నడిచి వచ్చి తన తాత బంగార్రాజు బండి ఎక్కినట్టు టీజర్ ఉంది.

ఈ టీజర్ మొత్తానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలాగే సినిమాటోగ్రఫర్ యువరాజ్ అందించిన విజువల్స్‌ చాలా అందంగా ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరు మీదున్న నాగ చైతన్య మరో రెండు హిట్లు కొడితే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. బంగార్రాజు పాత్రని పరిచయం చేస్తూ వదిలిన ఈ టీజర్ చూస్తుంటే నాగ చైతన్యకి మరో హిట్టు పడే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తుంది.

మరి 2022 సంక్రాంతికి విడుదలయ్యే ‘బంగార్రాజు’ ఆ అంచనాలను అందుకుంటాడేమో చూడాలి.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మైసూర్‌లో జరుగుతుంది. ఇక నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus