Naga Chaitanya: చైతూ థాంక్యూ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?

మనం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా విక్రమ్ కె కుమార్ గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. మనం సినిమాకు ముందు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఇష్క్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే 24, హలో, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు విక్రమ్ కె కుమార్ స్థాయికి తగ్గ సినిమాలు కావనే కామెంట్లు వినిపించాయి. థాంక్యూ సినిమాతో విక్రమ్ కె కుమార్ సక్సెస్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్టా. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ సినిమాలతో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న నాగచైతన్య థాంక్యూ సినిమాలో మూడు వేర్వేరు లుక్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుండగా ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.

బన్నీ సినిమా విడుదలైన వారం రోజులకే థాంక్యూ రిలీజైతే ఆ సినిమా కలెక్షన్లపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. చైతన్యకు జోడీగా థాంక్యూ సినిమాలో రాశీఖన్నాతో పాటు మాళవికా నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. బీవీయస్ రవి ఈ సినిమాకు కథ అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus