‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా చూసినప్పటి నుండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని (Mahesh Babu) అంతా కృష్ణుడిగా చూడాలని ఆశ పడుతున్నారు. అంతకు ముందు ‘హనుమాన్’ (Hanu Man) సినిమా టైంలో ‘జై హనుమాన్’ తీస్తున్నారు కాబట్టి అందులో మహేష్ ని శ్రీరాముని పాత్రలో చూపిస్తే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ లిస్టులో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కూడా ఉన్నాడు. వ్యక్తిగతంగా మహేష్ బాబుకి అతను పెద్ద ఫ్యాన్.
ఇతనితో మహేష్ సినిమా చేయాలంటే ఇంకో 5 ఏళ్లు పట్టొచ్చు. అందుకే ఈ గ్యాప్లో మహేష్ బాబు మేనల్లుడుతో చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమాలో ఏఐ సాయంతో మహేష్ ని కృష్ణుడి పాత్రలో చూపించాలని అనుకున్నాడు. మేనల్లుడి సినిమా కాబట్టి.. మహేష్ టీం నుండి ఎవ్వరూ అభ్యంతరం తెలుపరు అని ప్రశాంత్ వర్మ భావించాడు.
కానీ కట్ చేస్తే.. అతనికి రాజమౌళి (S. S. Rajamouli) అడ్డు చెప్పాడు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే నమ్రత (Namrata Shirodkar) అండ్ టీంకి.. రాజమౌళి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని వెనుక కూడా చిన్న కహానీ ఉంది. అదేంటంటే.. రాజమౌళి మహేష్ తో చేస్తున్న మూవీ మైథలాజికల్ టచ్ తో ఉంటుందట. అలాగే నిధి అన్వేషణ.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో కూడా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఓ సందర్భంలో మహేష్ ని రాముడి పాత్రలో చూపించబోతున్నాడట రాజమౌళి.
థియేటర్లలో ఆ పాత్రని చూసినప్పుడు ఆడియన్స్ మంచి హై ఫీలవ్వాలి అనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ లోపు ప్రశాంత్ వర్మ కృష్ణుడిగా చూపిస్తే.. రాజమౌళి సినిమాలో శ్రీరాముని పాత్రకి అనుకున్న రెస్పాన్స్ రాకపోవచ్చు. అందుకే రాజమౌళి అడ్డుపడినట్టు స్పష్టమవుతుంది. ఇక రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం.