Naga Chaitanya: థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో చైతు!

కరోనా పుణ్యమా అని డిజిటల్ మీడియాకి డిమాండ్ బాగా పెరిగింది. ప్రేక్షకులంతా ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. దీంతో ఇండియాలో భారీ ఎత్తున వెబ్ సిరీస్ లు, వెబ్ సినిమాలను నిర్మిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం డిజిటల్ ఎంట్రీపై ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ ల బాట పట్టారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ లాంటి స్టార్లు కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.

ఇప్పుడిప్పుడే సౌత్ హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి. అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడనేది తాజాగా సమాచారం. ఇప్పటికే చైతు భార్య సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో కీలకపాత్ర పోషించింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఆ సిరీస్ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు ఆ సిరీస్ రిలీజ్ కావడానికి ముందే చైతు ఓ వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో చైతు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

వారి నిర్మాణంలో చైతు ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. ఇది జాతీయ షాయిలో తెరకెక్కనున్న సిరీస్ అని తెలుస్తోంది. దీనికోసం రాధికా ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి బాలీవుడ్ తారలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వివిధ భాషల్లో ఈ సిరీస్ ను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం చైతు ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చైతు చేయబోయేది వెబ్ సిరీస్ అని.. ఇది థ్రిల్లర్ జోనర్ లో ఉంటునదాని సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus