Naga Chaitanya: నాగచైతన్య మనసులో ఉన్న దర్శకులు వీళ్లే… ఆ హీరోల్లాగే చైతు కూడా

వరుస సినిమాలు చేసి చేసీ… ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాతో దారుణమైన పరాజయంతో ఇప్పుడు రీథింక్‌ మోడ్‌లోకి వచ్చాడు నాగచైతన్య. అందుకే కొత్త సినిమాను అంత ఈజీగా ఓకే చేయలేదు. అలాగే ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ సినిమానే ‘తండేల్‌’. అయితే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి స్థాయిలో మొదలయ్యేలోపు తన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దూత’ ప్రచారం స్టార్ట్‌ చేసేశాడు. ఈ క్రమంలో తన సినిమా కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

నాగచైతన్య హీరోగా విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. డిసెంబర్ 1న ఈ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన మనసులో ఉన్న కొన్ని సినిమా కోరికలను వెలిబుచ్చాడు. బాలీవుడ్‌లో ఏయే దర్శకులతో పని చేయాలని ఉంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. దీంతో ఆ దర్శకులు వెంటనే చైతు కోసం కథ రాస్తే బాగుండు అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్‌లో తనకు అయాన్ ముఖర్జీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకులు అంటే చాలా ఇష్టమని, అలాంటి వారితో సినిమా చేయాలని ఉంది అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని మరీ వత్తి చెప్పాడు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వేక్ అప్ సిడ్‌’ సినిమా తనకు ఫేవరెట్ అని తెలిపాడు. అలాగే యాక్షన్‌ మాస్టర్‌ రోహిత్ శెట్టి సినిమాల్లో వినోదం నచ్చుతుంది అని చెప్పాడు.

తెలుగు దర్శకుల సినిమాలు ఎన్ని చేసినా… కొంతమంది హిందీ దర్శకుల సినిమాలు చేయాలని మన హీరోలు అనుకుంటూనే ఉంటారు. కుర్ర స్టార్‌ హీరోలు చాలామంది సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాల్లో భాగం అవ్వాలని కోరుకోవడం కొత్తేమీ కాదు. అయితే వాళ్ల కోరిక అయితా ఇంకా నెరవేరలేదు. చైతు (Naga Chaitanya) కోరిక ఏమవుతుందో చూడాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus