Thandel: ‘తండేల్’ బడ్జెట్ .. నాగ చైతన్య మార్కెట్ కి మించి..!

  • December 10, 2023 / 03:20 PM IST

అక్కినేని నాగ చైతన్య , దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో ‘ప్రేమమ్’ ‘సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత రాబోతున్న మూడో చిత్రం ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ ను ప్రారంభించినప్పటికీ అధికారికంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రాండ్ గా సినిమా ప్రారంభమవుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్’ నుండి నాగ చైతన్య లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

దీనికి సూపర్ రెస్పాన్స్ లభించింది. కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో నాగ చైతన్య ఊర మాస్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో ఓ గేమ్ ఛేంజర్ మూవీ అవుతుందని చిత్ర బృందం భావిస్తుంది. ‘కార్తికేయ 2 ‘ తో దర్శకుడు చందూ మొండేటి నార్త్ లో కూడా సక్సెస్ అందుకున్నాడు. కాబట్టి ‘తండేల్’ ను నార్త్ లో కూడా మొదటి నుండి బాగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ‘తండేల్’ (Thandel) సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మొదట ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ రూ.70 కోట్లు అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది రూ.110 కోట్ల వరకు పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. అంటే నాగ చైతన్య మార్కెట్ కి డబుల్ బడ్జెట్ పెట్టడం అనే చెప్పాలి. మరి అంత మొత్తం రికవరీ సాధించేలా చేయాలి అంటే చాలా కష్టం. మరి ‘గీతా ఆర్ట్స్’ వారి ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి..!

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus