Thandel: నాగచైతన్య నుండి ఈ ఏడాది సినిమా వచ్చే పరిస్థితే లేదా? ‘తండేల్‌’ ఎప్పుడు?

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనే ఓ సామెత ఉంది మీకు తెలుసా? అంటే ఆ విషయానికి సంబంధం లేని మనిషికి అనవసరంగా ఇబ్బంది ఎదురైనట్లు అని అన్నమాట. ఇప్పుడు నాగచైతన్య  (Naga Chaitanya) – చందు మొండేటి (Chandoo Mondeti) ‘తండేల్‌’కి (Thandel)  ఈ పరిస్థితి వచ్చిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చాలా రోజుల క్రితమే డిసెంబరులో వస్తాం అని చెప్పి షూటింగ్‌ చేసుకుంటున్న ఈ సినిమా విడుదల వాయిదా వేస్తారు అంటూ ఓ చర్చ మొదలైంది టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో. దీంతో ఈ విషయంలో క్లారిటీ కావాలి అంటూ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. నాగచైతన్య సరసన సాయిపల్లవి (Sai Pallavi)  నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ 2 తెరకెక్కిస్తోంది. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు కొంతమంది వేటకు వెళ్లి పాకిస్థాన్‌లో అధికారులకు పట్టుబడతారు. ఆ తర్వాత ఎన్నో దౌత్య పోరాటాల తర్వాత ఇండియాకు వస్తారు. ఈ క్రమంలో ఏం జరిగింది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు చూపిస్తూనే.. మధ్యలో ఓ అందమైన ప్రేమకథను చూపించబోతున్నారు.

ఈ సినిమాను డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే సినిమా టీం ప్రకటించింది. అయితే అయితే ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉందంటూ ఓ చర్చ మొదలైంది. డిసెంబరులో భారీ చిత్రాలు వరుస కడుతున్నాయని, ఈ సమయంలో వచ్చి ఇరుక్కునే కంటే తర్వాత సావధానంగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నట్లు ఓ చర్చ మొదలైంది. మరి టీమ్‌ ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలియాల్సి ఉంది.

ఇక అల్లు అర్జున్‌ (Allu Arjun)  – సుకుమార్‌  (Sukumar)  ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  , రామ్‌ చరణ్‌(Ram Charan)  – శంకర్ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  , మంచు విష్ణు ‘కన్నప్ప’  (Kannappa) ఈదుకుంటూ ఈదుకుంటూ డిసెంబరుకు చేరాయి. అప్పటికే అక్కడ నితిన్‌  (Nithiin)  – శ్రీలీల (Sreeleela)  ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood)  ఉంది. బాలకృష్ణ (Balakrishna) – బాబీ (Bobby)  సినిమా కూడా అప్పుడే అంటున్నారు. దీంతో ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus