‘యుద్ధం శరణం’ అంటున్న నాగచైతన్య !

  • July 3, 2017 / 09:35 AM IST

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రానికి “యుద్ధం శరణం” అనే టైటిల్ ను నిర్ణయించి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రీకరణ చివరి దశలో ఈ చిత్రం టీజర్ మరియు ఆడియో విడుదల తేదీలను కూడా నిర్ణయించినట్లు చిత్ర బృందం చెబుతోంది. “పెళ్లి చూపులు” ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారథ్యం వహించనుండగా.. శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యుద్ధం శరణం”. కథకి తగిన టైటిల్ ఇది. నాగచైతన్య లుక్-యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. శ్రీకాంత్, రావు రమేష్‌‌లు కీలకపాత్రలు పోషించనున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 15న ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా “యుద్ధం శరణం” నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది” అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus