టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఈయన చేసే సినిమాలన్ని కూడా హిట్ ఫ్లాప్ అనే విషయాలు పక్కన పెట్టి చాలా విభిన్నంగా ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకుంటారు. ఇక తాజాగా నాగశౌర్య యుక్తి తరేజ హీరో హీరోయిన్లుగా పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన రంగబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జులై ఏడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నాగశౌర్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
అంతేకాకుండా ఈ సినిమా ద్వారా తప్పకుండా విజయం అందుకోబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మన సొంత ఊరిని మన మూలాలను గుర్తుచేసే చిత్రమే రంగ బలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకు ఈ పేరు పెట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది అని తెలిపారు.
అదేవిధంగా తన (Naga Shaurya) సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు తాను 18 మంది దర్శకులతో పని చేశానని తెలిపారు. ఇలా ఇంతమందితో పని చేసినప్పుడు కొన్నిసార్లు సక్సెస్ అయ్యాను అని మరికొన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యాను అని తెలిపారు. సక్సెస్ అయినప్పుడు నా నిర్ణయం సరైనదని ఫెయిల్యూర్ అయినప్పుడు నిర్ణయం సరైనది కాదని నేనెప్పుడూ భావించలేదని తెలిపారు.
ఇండస్ట్రీలో కొనసాగడం అంటే సమయం కీలకమైనదని తెలిపారు. మన టైం వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.అందుకే తాను ఇండస్ట్రీలోనే కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. హీరోగా తనకు అవకాశాలు రాకపోయినా చివరికి లైట్ బాయ్ గా పనిచేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని నాగశౌర్య తెలిపారు. నాకు సినిమా ఇండస్ట్రీ తప్ప మరేది తెలియదని అందుకే తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!