Naga shaurya: నితిన్‌లా మారిపోయిన శౌర్య… పవన్‌ బీట్‌కు మాస్‌ స్టెప్పులు!

టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ మేనరిజమ్స్‌, డ్యాన్స్‌ స్టెప్పులకు ఉన్న క్రేజే వేరు. అందుకే వాటిని ఇమిటేట్‌ చేయడానికి, చేసి వైరల్‌ అవ్వడానికి ఎంతోమంది కుర్రాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మన కుర్ర హీరోలు కూడా ఉన్నారు. పవన్‌ మేనరిజమ్‌ ఆయన చేస్తే ఎంత బాగుంటుందో.. ఆయన ఫ్యాన్స్‌ అయిన కుర్ర హీరోలు చేసినా అంతే బాగుంటుంది. కానీ ఆయనంత గ్రేస్‌ రాదనుకోండి. ఇలాంటివాటికి టాలీవుడ్‌లో నితిన్‌ బాగా ఫేమస్‌. ఇప్పుడు అతనిలా మరో హీరో అదే పని చేశాడు.

పవన్ కల్యాణ్‌ డ్యాన్స్‌లో హెవీ మూమెంట్స్‌ ఉండవు. ఒకవేళ ఉన్నా.. అది ఇప్పటితరం హీరోలకు ఇబ్బంది కాదు. ‘రంగబలి’ కోసం నాగశౌర్య ఇదే పని చేశాడు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హెవీగా స్టెప్పులు వేసిన పాట అంటే ‘జానీ’ సినిమాలోని ‘నారాజ్‌ గాకురా మా అన్నయ్య’ అని చెప్పాలి. అందులో గ్రూపు మధ్యలో దుమ్ములో భలే స్టెప్పులేస్తాడు పవన్‌. ఆ స్టెప్పులనే ఇప్పుడు నాగశౌర్య వేశాడు. ‘రంగబలి’లో కోసం జానీ మాస్టర్‌తో కలసి ఈ స్టెప్పులేశారు.

ఆ స్టెప్పుల వరకు ఓ వీడియో కట్‌ చేసి టీమ్‌ ఇటీవల షేర్‌ చేసింది. అందులో చూస్తే జానీ మాస్టర్‌ ఎనర్జీని, మ్యాచ్‌ చేస్తూ నాగశౌర్య అదరగొట్టాడు అని చెప్పాలి. జానీ మాస్టర్‌ స్పీడ్‌గా డ్యాన్స్‌ చేస్తుంటే.. సింక్‌ చేస్తూ శౌర్య కూడా ఆ స్టెప్పులు వేశాడు. యూట్యూబ్‌లో చూస్తేనే ఆ పాట అంత బాగుంది అంటే.. మరి బిగ్‌ స్క్రీన్‌పై ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి. పవన్‌కి జానీ పెద్ద ఫ్యాన్స్‌, శౌర్య కూడా అంతే. మరి ఆ ఫ్యాన్స్‌ డ్యాన్స్‌ను ఫ్యాన్స్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తారో చూడాలి.

ఇక ‘రంగబలి’ సినిమా విషయానికొస్తే.. తన ఊరంటే అమితమైన ప్రేమ ఉన్న ఓ యువకుడు ఆ ఊరి కోసం ఏం చేశాడనేదే కథ. జులై 7న ఈ సినిమా విడుదల కానుంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటించింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus