తాను హీరోగా మాత్రమే కాక రచయితగానూ ఇన్వాల్వ్ అయిన సినిమా. అందులోనూ సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా. ఇన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక హీరోకి టెన్షన్ ఉండడం అనేది కామన్. అందులోనూ సినిమా కాన్సెప్ట్ తో నాగశౌర్య ఏ రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఏకంగా తన గుండెపై సదరు సినిమా టైటిల్ “అశ్వథ్థామ”ను పచ్చబొట్టు పొడిపించుకొనేంత. సినిమాకి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేసరికి సంతోషించినా.. సినిమా ఉహుంచినంత స్పీడ్ గా కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమవ్వడంతో శౌర్య & టీం కాస్త కంగారుపడ్డారు.
అయితే.. అశ్వథ్థామ అనంతరం విడుదలైన సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోవడంతో.. హ్యాపీగా రెండోవారంలో “అశ్వథ్థామ” కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కొట్టింది. దాంతో నాగశౌర్య తోపాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆనందంగా ఉన్నారు. సొ, నాగశౌర్య హీరోగా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా సక్సెస్ కొట్టినట్లే. తదుపరి సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్త చూపిస్తే మరింత ఘన విజయం అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Most Recommended Video
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!