Naga Shourya: కోడలు నన్ను అలా పిలుస్తుంది.. నాగశౌర్య తల్లి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగశౌర్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2022 సంవత్సరంలో నాగశౌర్య పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నాగశౌర్య భార్య పేరు అనూష శెట్టి కాగా ఆమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్నారు. బెంగళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో నాగశౌర్య అనూషల వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజుల తర్వాత నాగశౌర్య వేరు కాపురం పెట్టారట.

నాగశౌర్య తల్లి మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. నాగశౌర్య తల్లి పేరు ఉషా ప్రసాద్ కాగా అనూష నాకు మూడు సంవత్సరాల క్రితమే తెలుసని ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నానని అన్నారు. ఆమె నన్ను మమ్మా అని పిలుస్తుందని నాగశౌర్య తల్లి పేర్కొన్నారు. ఆమె నా భర్తను డాడీ అని పిలుస్తుందని ఆమె వెల్లడించారు. అనూష చాలా మంచి అమ్మాయి అని నాగశౌర్య తల్లి చెప్పుకొచ్చారు.

తనకు చాలా మెచ్యూరిటీ ఉందని ఆమె కామెంట్లు చేశారు. శౌర్య అనూష మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆమె పేర్కొన్నారు. పెద్ద కోడలు అమెరికాలో సెటిలైందని యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందని నాగశౌర్య తల్లి కామెంట్లు చేశారు. చిన్న కోడలు ఇంటీరియర్ డిజైనర్ గా సెటిలైందని నాగశౌర్య తల్లి వెల్లడించారు. చిన్న కోడలు ఎంత బిజీగా ఉన్నా అన్ని పనులను చక్కబెట్టుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

పెళ్లి తర్వాత నాగశౌర్య (Naga Shourya) అనూష వేరు కాపురం పెట్టారని దూరంగా ఉండి అప్పుడప్పుడూ కలుసుకుంటేనే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడనుకున్నది కాదని పిల్లలు పుట్టినప్పుడు, పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నామని ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరి స్వాతంత్రం వారికి ఇస్తే బాగుంటుందని ఉష పేర్కొన్నారు. ఇది మాకు మొదటినుంచి ఉన్న ఒపీనియన్ అని ఇందులో అంతలా ఆలోచించాల్సింది ఏమీ లేదని ఉష అన్నారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus