‘నా సినిమాలు వచ్చినప్పుడే పక్క సినిమా మేకర్స్ కి సింపతీ కార్డులు గుర్తుకొస్తున్నాయి’ అంటూ మొన్నామధ్య నాగ వంశీ (Suryadevara Naga Vamsi ) కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) టైంలో ‘హనుమాన్’ (Hanuman) మేకర్స్ సింపతీ కార్డు వాడుకున్నారు. అది సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వచ్చినప్పుడు.. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA) సినిమా మేకర్స్ సింపతీ కార్డు వాడారు.. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అందుకే నాగవంశీ అలా చెప్పడం జరిగింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా టీం విజయవాడ వెళ్లడం జరిగింది. అందులో భాగంగా.. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ” మార్చి 28న ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే.. ప్రేక్షకులు మా సినిమా వైపే అడుగులు వేసి ఘన విజయం చేకూర్చాలి. తర్వాత ఆర్డర్లో ఆ సినిమాల్ని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా మైత్రి రవిశంకర్ (Y .Ravi Shankar) కామెంట్స్ పై ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ సెటైర్ వేశారు. ఈ విషయంపై నాగవంశీ మాట్లాడుతూ.. “ఈసారి నేను కూడా అనుకున్నాను. సింపతీ కార్డు ట్రై చేద్దామని. నిన్నో మొన్నో గుర్తులేదు కానీ.. మా ‘మైత్రి’ రవన్న విజయవాడ వెళ్లి ‘మా సినిమా చూడండి.. మా సినిమానే చూడండి’ అని చెప్పాడు. చూశారా.. మైత్రి రవన్న ఎంత అన్యాయం చేశాడో మాకు. మా సినిమా చూడొద్దు అని చెప్పాడు.
వాళ్ళ సినిమానే చూడమన్నాడు. కాబట్టి.. ఇది కొంచెం సీరియస్ గా తీసుకుని.. మా చిన్న సినిమాని ఆయన తొక్కేయకుండా, మా సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.. నేను..! మరి ఈ స్టేట్మెంట్ కి ఏమైనా సింపతీ జెనరేట్ అవుతుందేమో చూడాలి(నవ్వుతూ)” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
‘మైత్రి’ రవి అన్న మా సినిమాని తొక్కేయాలని చూస్తున్నాడు : నాగవంశీ @vamsi84 funny reactions on #SympathyCards #MADSquare #Robinhood #MADSquareOnMarch28th #MADSquareFromMarch28th #RobinhoodOnMar28th #nagavamsi #NagaVamsi pic.twitter.com/DPCVNr1Jcr
— Phani Kumar (@phanikumar2809) March 20, 2025