Chiranjeevi: అనిల్ రావిపూడి ట్వీట్ వెనుక అంత మీనింగ్ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు ‘విశ్వంభర’ (Vishwambhara)  తో బిజీగా గడుపుతున్నారు.దీని తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఒక దర్శకుడి కథకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా అరుదు. ప్రతి దర్శకుడికి ఆయన టెస్టులు పెడుతుంటారు. ‘స్కూల్ స్టూడెంట్స్ పాఠం అప్పగించమని చెప్పినప్పుడు.. ఒకవేళ ఆ స్టూడెంట్ సరిగ్గా చెప్పకపోతే, మళ్ళీ చదువుకుని రా అన్నట్టు, ఒకవేళ 2వ సారి కూడా సరిగ్గా అప్పగించకపోతే మళ్ళీ మళ్ళీ చదువుకుని రా అని కరెక్ట్ గా వచ్చేవరకు మాస్టారు ఎలా చేస్తాడో’ చిరు కూడా అలాగే చేస్తూ వస్తున్నారు.

Chiranjeevi

ఈ దశలో వెంకీ కుడుముల (Venky Kudumula)  వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని కూడా ఆయన పక్కన పెట్టడం జరిగింది. అలాగే మల్లిడి వశిష్ట్ కి (Mallidi Vasishta) కూడా ఆయన వెంటనే ఛాన్స్ ఇచ్చింది లేదు. అయితే అనిల్ రావిపూడితో సినిమాకి మాత్రం చిరు వెంటనే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ నేరేషన్ కూడా అయిపోయిందట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. తన ట్విట్టర్ ద్వారా అనిల్ రావిపూడి..

“ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ డన్ & లాక్డ్, చిరంజీవి గారికి నా కధ లో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను ..! హి లవ్డ్ & ఎంజాయ్డ్ ఇట్ తరోలీ…!ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగ బొమ్మ కి శ్రీకారం” అంటూ రాసుకొచ్చి #ChiruAnil ” అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశాడు. అయితే చిరంజీవి గారికి ‘నా కధ లో పాత్ర ‘శంకర్ వరప్రసాద్’ ని పరిచయం చేశాను ..!

‘ అంటూ చెప్పడం కొంచెం చర్చనీయాంశం అయ్యింది. ఒకవేళ చిరు ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే టాక్ కూడా నడుస్తోంది. అప్పుడు చిరు డబుల్ రోల్ చేస్తున్నట్టు అనుకుంటున్నారేమో. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి

మార్కెట్ లో సైలెంట్.. బిజినెస్ మాత్రం గట్టిగానే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus