Naga Vamsi: స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయడానికి నాగవంశీ పాట్లు!

స్టార్ హీరో చేతిలో ఉన్నాడు అంటే నిర్మాత చెలరేగిపోవచ్చు. డేట్స్ ఇస్తాను నువ్వు నిర్మాతగా సినిమా చేస్కో.. అంటే చాలు ఆ నిర్మాత అంత అదృష్టవంతుడు ఉండడు అనే చెప్పాలి. అతను పూర్తిగా పెట్టుబడి పెట్టకపోయినా.. అనౌన్స్మెంట్ ఇస్తే చాలు ఫైనాన్షియర్స్ వస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్సులు ఇచ్చేస్తారు. దర్శకుడు కరెక్ట్ గా షూటింగ్ అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తే.. బిజినెస్ బాగా జరుగుతుంది.హైప్ అనేది బిల్డ్ అయితే మొదటి నుండి భారీ లాభాలు వస్తాయి.

Naga Vamsi

దీంతో పెద్ద నిర్మాత అనే పేరు కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్యాకప్ కోసం ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ బ్యాచ్ వంటి వాళ్ళు.. సినిమాలకి ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తారు. ఇది చదువుతుంటే మనం కూడా నిర్మాత అయిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది కదా. స్టార్ హీరోల అండదండలు ఉంటే ఇలా ఉంటుంది నిర్మాత లైఫ్. మరోపక్క ఆ స్టార్ హీరో కోసం ఫేవర్లు వంటివి కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

నచ్చకపోయినా అతని సినిమా హక్కులను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితులు నాగవంశీకి (Suryadevara Naga Vamsi) వచ్చినట్టు ఉన్నాయి. అందుకే స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయడానికి ఇష్టం లేకపోయినా మొహమాటానికి కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. విజయ్ (Vijay Thalapathy) కోసం ‘బీస్ట్’ ని (Beast) తెలుగులో రిలీజ్ చేశాడు. అది కంటెంట్ పరంగా మెప్పించలేదు..

నాగవంశీ అదృష్టం బాగుండి డబ్బులు వచ్చాయి. ‘దేవర’ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ (Jr NTR)  డేట్స్ కోసం ‘దేవర’ ని (Devara) హ్యాండిల్ చేశాడు. ఇక ఇప్పుడు సూర్యని (Suriya) ఇంప్రెస్ చేయడానికి ‘రెట్రో’ (Retro) రిలీజ్ చేశాడు. ఈసారి మాత్రం నాగవంశీకి నష్టాలు తప్పేలా లేవు. స్టార్ హీరోల దృష్టిలో పడటానికి నిర్మాతలు ఇలా కూడా నలిగి పోవాలి అని నాగవంశీని చూసి అర్థం చేసుకోవచ్చు.

‘రెట్రో’ ..నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పడిపోయాయి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus