త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం గుంటూరు కారం ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. అలాగే షూటింగ్ పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మొదటిగా పూజా హెగ్డే శ్రీలీలా హీరో హీరోయిన్లుగా అనుకున్నారు.
కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా పూజా హెగ్డే తప్పుకోవడంతో మరొక హీరోయిన్ ని తీసుకువచ్చారు. అయితే పూజ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలా పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగ వంశీ ఈ వార్తలపై స్పందిస్తూ ఈ సినిమా నుంచి పూజ ఎందుకు తప్పుకున్నారనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ… గుంటూరు కారం సినిమా నిజానికి 2023 ఆగస్టు నెలలోనే విడుదల చేయాలని భావించాము అయితే ఈ సినిమా కాస్త 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా విడుదల తేదీ కూడా మారడంతో ఈ సినిమా షూటింగ్ కంగారు లేకుండా చాలా నెమ్మదిగా చేస్తున్నాము. ఈ క్రమంలోనే పూజా హిందీలో ఓ చేయాల్సివచ్చింది. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమెను గుంటూరు కారం నుంచి ఆమెను తప్పించాం అని అన్నారు. అయితే పూజ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చాలామంది ఎన్నో రకాల వార్తలను సృష్టిస్తున్నారని ఈ వార్తలని పూర్తిగా ఆ వాస్తవం అని ఈ సందర్భంగా నాగ వంశీ (Naga Vamsi) చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.