Naga Vamsi: ‘గుంటూరు కారం’ పై అంచనాలు పెంచేస్తున్న నాగవంశీ!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్లాసిక్స్ తర్వాత రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యాయి. వాటికి సో సో రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. గ్లింప్స్ పర్వాలేదు అనిపించినా.. అది చూడటానికి ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సీతారాల సిరపడు’ స్టైల్లో ఉందని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

కాబట్టి.. ఇప్పుడు అర్జెంట్ గా ‘గుంటూరు కారం’ నుండి అదిరిపోయే స్టఫ్ అభిమానులకి కావాలి. ట్రైలర్ .. తోనే నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెడుతుంది అని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ మాత్రం ‘గుంటూరు కారం’ పై అంచనాలు పెంచడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నాగ వంశీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ స్పేస్ కి వచ్చి..

‘గుంటూరు కారం’ సినిమా గురించి మహేష్ అభిమానులతో ముచ్చటించారు. ‘ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటుంది అని.. మళ్ళీ క్లైమాక్స్ అదిరిపోతుంది అని’ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ అభిమానుల అంచనాలు ఇంకా పెరిగిపోయాయి అనే చెప్పాలి. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. అందులో డౌట్ లేదు. అదే నాగవంశీ (Naga Vamsi) కాన్ఫిడెన్స్ అయ్యుండొచ్చు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus