మెగా బ్రదర్ నాగబాబు ఒకవైపు చిత్ర పరిశ్రమలోనూ మరోవైపు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ ఆయన పార్టీకి మద్దతుగా ఉంటా కానీ ఎలాంటి పోటీకి రానని వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం నాగబాబు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు ఇతర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందర్శిస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో నటించారు.ఇలా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇదివరకే ఈయన బ్యానర్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆయనని నిర్మాతగా నిలబెట్టలేకపోయాయి.ఎంతోమంది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హీరోలందరూ తన కుటుంబంలో ఉన్నప్పటికీ నిర్మాతగా నాగబాబుని మాత్రం నిలబెట్టే లేకపోయాయి. ఇకపోతే తాజాగా మరో సారి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నాగబాబు సిద్ధమయ్యారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఈయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా నాగబాబు బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే బుల్లితెర కార్యక్రమాల ద్వారా నాగబాబు భారీగానే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాగబాబు సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కలిగి ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో మాత్రం తనకు, తన భార్యకు 41 కోట్ల రూపాయల స్థిరాస్థులు, చరాస్థులు ఉన్నాయని నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈయన ప్రస్తుతం 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగానూ, సినిమాలలో కీలక పాత్రలో నటించడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా కూడా ఈయన ప్రేక్షకులను సందడి చేస్తున్నారు