మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. అయితే ఆ రాజకీయం అంతా ‘మా’ సొంత భవనం చుట్టూనే తిరుగుతోంది. ‘మా’కు భవనం కట్టిస్తామని మంచు విష్ణు ప్యానల్ పోటీకి సిద్ధమవుతుంటే, పేద నటీనటులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ప్రకాశ్ రాజ్ ప్యానల్ అంటోంది. అయితే మధ్యలో మోహన్‌బాబు వచ్చి, గతంలో భవనం కొని అమ్మేశారు అంటూ బాంబు పేల్చారు. అంతేకాదు ఎక్కువ ధరకు కొని, తక్కువ ధరకు అమ్మేశారు అంటూ ఇష్యూలో సీరియస్‌నెస్ పెంచారు. తాజాగా దీనిపై నాగబాబు స్పందించారు.
మోహన్‌బాబు చెబుతున్నట్లుగా ‘మా’ బిల్డింగ్ కొన్న విషయం నిజమేనని, అంతేకాదు ఆ బిల్డింగ్ అమ్మేసినా మాట వాస్తవమే అని నాగబాబు అన్నారు. ఈ వ్యవహారం గురించి శివాజీరాజా, నరేశ్‌కే తెలుసని కూడా చెప్పారు. భవనం గురించి మోహన్‌బాబు మాట్లాడేటట్లయితే… వారిద్దరినే అడగాలని నాగబాబు సూచించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ విషయంలో ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అందులో మోహన్‌బాబు ‘మా’ భవనం గురించి ప్రస్తావించారు. ‘‘అధిక మొత్తంతో ‘మా’ భవనాన్ని కొని… అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారు. అప్పుడు సినిమా పెద్దలు ఎందుకు స్పందించలేదో తెలియదు’ ’ అని మోహన్‌బాబు అన్నారు.
దానికి ఇన్ని రోజుల తర్వాత నాగబాబు స్పందించారు. భవనం కొనుగోలు చేసిన సమయంలో (2006-2008) అధ్యక్షుడిగా నేనే ఉన్నాను. సినిమా పెద్దల సూచనలు, అప్పుడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ₹71.73 లక్షలతో భవనం కొన్నాం. ఇంటిరీయర్ డిజైన్ కోసం మరో ₹3 లక్షలు ఖర్చు చేశాం. 2008 తర్వాత నేను ‘మా’ వ్యవహరాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిగా లేను. మా అధ్యక్షుడిగా శివాజీరాజా, ప్రధాన కార్యదర్శిగా నరేశ్ ఉన్నప్పుడే బిల్డింగ్ బేరం పెట్టి రూ.30 లక్షలకే అమ్మేశారు. కాబట్టి ఎందుకు అమ్మేశారో వాళ్లే చెప్పాలి. మోహన్‌బాబు ఆయన ప్రశ్నలను ఆ ఇద్దరికే వేయాలి అని అన్నారు నాగబాబు. అంతేకాదు బిల్డింగ్ అమ్మకం వ్యవహరం గురించి మళ్లీ నాపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తాను అని ఘాటుగా కామెంట్ చేశారు కూడా.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!