Nagababu: పర్ఫార్మెన్స్‌ లేకపోయినా ఫర్వాలేదు… నాగబాబు కామెంట్స్‌ ఎవరిని ఉద్దేశించి!

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లార్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి వచ్చారు. అయితే ఆ వేదిక మీద నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన ఎందుకున్నారు, ఏ ఉద్దేశంలో అన్నారు అనేది క్లారిటీ లేకపోయినా ‘హీరోయిజం’ గురించి అన్నారు అని మాత్రం తెలుస్తోంది. దీంతో ఎవరినైనా ఉద్దేశించి అన్నారా? లేక వరుణ్‌ గురించి చెబుతూ అలా అన్నారా అనేది తెలియడం లేదు.

శక్తి ప్రతాప్‌సింగ్‌ హుడా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఆ వేదిక మీద నాగబాబు మాట్లాడుతూ… కొత్తదనంతో నిండిన సినిమాలు చేయాలనుకుంటాడు వరుణ్‌. ఈ క్రమంలో రిస్క్‌ తీసుకుంటాడు కూడా. అలా చేసినప్పుడు చాలాసార్లు ఫెయిలయ్యాడు. కానీ, కథలు, పాత్రలు ఎంపిక విషయంలో చాలా కొత్తగా ఉంటాడు. ఆ విధానం తనకు బాగా ఇష్టమని చెప్పారు.

కొడుకు విజయం అందుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో, ఫ్లాప్‌ వచ్చినప్పుడు అంతే బాధ ఉంటుంది. నా బాధ తనకు, తన బాధ నాకు తెలుసు అని చెప్పారు (Nagababu) నాగబాబు. ఆ తర్వాత నాగబాబు చేసిన కామెంట్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వరుణ్‌కు మంచి పర్సనాలిటీ ఉందని, కొన్ని పాత్రల విషయంలో ఇలాంటి కటౌట్‌ ఉన్నవారు పెద్దగా పెర్ఫామెన్స్‌ చేయకుండా నిల్చున్నా బాగుంటుంది అని కామెంట్‌ చేశారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అనే ప్రశ్న వస్తోంది.

మా అమ్మ వాళ్ల నాన్న, మేనమామ, మా పెద్దనాన్న మిలటరీలో పనిచేశారని, టెక్నాలజీ లేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో పెద్దనాన్న చెప్పేవారని తెలిపారు. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా పూర్తయి చాలా రోజులే అయింది. వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఫలితంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus