తమ్మారెడ్డిపై మరోసారి నాగబాబు షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ రావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి రేయింబవళ్లు పడిన కష్టం అంతాఇంతా కాదు. అయితే ఈ అవార్డ్ కోసం రాజమౌళి కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విధంగా ప్రచారం జరిగేలా తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లకు నాగబాబు నుంచి తనదైన శైలిలో కౌంటర్లు వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆస్కార్ వస్తుంటే తెలుగోడి సత్తా ఇదీ అని గర్వించాలి కానీ కుళ్లుకుని చచ్చిపోవడం ఏంటని నాగబాబు ప్రశ్నించారు.

మెచ్చుకునే సంస్కారం మీకు లేకపోవచ్చని కానీ కుళ్లుకునే దుస్థితి ఏంటని నాగబాబు చెప్పుకొచ్చారు. మనం సినిమాలు మానేశాం.. ప్రొడక్షన్ మానేశాం.. రిటైరైపోయాం.. కుక్కలకు కూడా పనికిరాం అంటూ తమ్మారెడ్డిపై నాగబాబు సెటైర్లు వేశారు. గతంలో తమ్మారెడ్డి రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సైలెంట్ గా ఉన్నానని ఇప్పుడు మాత్రం తాను ఊరుకోనని నాగబాబు కామెంట్లు చేశారు. గతంలో తమ్మారెడ్డి తీసిన సినిమాలలో నటించిన నటీనటులకు సరైన పారితోషికాలు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.

తమ్మారెడ్డి వీడియోలు పెట్టుకుని కథలు చెప్పాలే తప్ప మేధావులలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని నాగబాబు చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చూశారా? వాళ్ల లెగ్ వర్క్ గమనించారా? గట్టిగా నిలబడితే మోకాళ్లు పని చేయవు అని నాగబాబు తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. పనికిమాలిన పబ్లిసిటీ స్టంట్లు ఎందుకు తమ్మారెడ్డి అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

ఇప్పటికైనా తమ్మారెడ్డి కళ్లు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని ఇప్పుడు మాపై మీరు రియాక్ట్ అయితే మేం లక్ష రెట్లు ఎక్కువగా రియాక్ట్ అవుతామని నాగబాబు అన్నారు. నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు నాగబాబు ట్రోల్స్ గురించి తమ్మారెడ్డి కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఎప్పటికి ఆగుతుందో చూడాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus