Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి హైప్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో ‘నాగబంధం’ (Nagabandham) యూనిట్ వందకి వంద శాతం సక్సెస్ సాధించింది అని చెప్పాలి. డెవిల్ తర్వాత అభిషేక్ నామా డైరెక్ట్ చేసిన సినిమా ఇది. పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ ఈ సినిమాలో హీరోగా నటించాడు. నిషిత రెడ్డి, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి దాదాపు వంద కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రమోషన్స్ లో నిర్మాతలు తెలిపారు.టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

Nagabandham Collections

అందులోని విజువల్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాకి బిజినెస్ బాగా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో బుకింగ్స్ తగ్గాయి. వీకెండ్ వరకు వసూళ్లు ఓకే అనిపించాయి.

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.8 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర(టోటల్) 1.1 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 3.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + తమిళనాడు 1.15 cr
 ఓవర్సీస్ 0.80 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.1 cr (షేర్)

‘నాగ బంధం’ (Nagabandham) చిత్రానికి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.5.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.14.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి.

పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus