Nagarjuna: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నాగ్!

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాలో, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు జరుగుతుండగా వచ్చే ఏడాది కొన్ని నెలల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే టాలీవుడ్ లో ఏ హీరోకు సొంతం కాని రికార్డును నాగార్జున మాత్రం సొంతం చేసుకోవడం గమనార్హం. బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలలో నటించిన సౌత్ ఇండస్ట్రీ హీరోలలో నాగ్ ఒకరు.

హిందీలో శివ, ఖుదా గవా, ద్రోహి, మిస్టర్ బేచారా, అంగారే, జక్మ్, అగ్నివర్ష సినిమాలలో నాగార్జున నటించారు. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలతో నాగార్జున విజయాలను సైతం సొంతం చేసుకోవడం గమనార్హం. ఎక్కువ బాలీవుడ్ సినిమాల్లో నటించి నాగ్ సొంతం చేసుకున్న రికార్డును భవిష్యత్తులో ఏ టాలీవుడ్ హీరో అధిగమిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన దర్శకుడిగా నాగార్జునకు పేరుంది.

ఈ మధ్య కాలంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ ను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video



మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus