రామ్ మల్టీస్టారర్ కి ఓకే చెప్తాడా..?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కొన్నేళ్ల క్రితం నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ అనే పేరుతో సీక్వెల్ ప్లాన్ చేశాడు. నాగార్జున కూడా ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయాల్సివుంది.

కానీ ఇప్పుడు తేడా రావడంతో ప్రవీణ్ సత్తారు సినిమాను హోల్డ్ లో పెట్టేశారట. దీంతో ‘బంగార్రాజు’ సినిమాను ముందుగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుండి ఒకటే సమస్య.. అదేంటంటే హీరో నాగచైతన్య డేట్స్ కూడా కావాలి. కానీ ప్రస్తుతం చైతు చాలా బిజీగా ఉన్నాడు. ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసి.. విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ సినిమాను మొదలుపెట్టాడు. ఆ తరువాత ఇంద్రగంటితో ఓ సినిమా చేయనున్నారు. లైన్లో వెంకీ అట్లూరి సినిమా ఉంది. ఎడ్యుకేషనల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీయాలనుకుంటున్నారు.

దీంతో చైతు డైరీ మొత్తం ఫుల్ అయిపోయింది. నాగ్ కూడా చైతుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. వేరే హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలో యంగ్ హీరోల్లో రామ్ ని ఫస్ట్ ఛాయిస్ గా అనుకున్నారట. రామ్ తో అయితే సినిమాకి మల్టీస్టారర్ లుక్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ ఒప్పుకుంటే అతడినే ఫైనల్ చేయాలనుకుంటున్నారు. కాని పక్షంలో నాగశౌర్యని ఆప్షన్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus