Nagarjuna: నాగార్జున కార్ల కలెక్షన్ చూశారా.. ‘మనం’ సీన్ రిపీట్..!

ఖైరతాబాద్ ఆర్.టి.ఓ ఆఫీస్లో అక్కినేని నాగార్జున (Nagarjuna)  సందడి చేశారు. తాజాగా ఆయన కొత్త కారు కొనుగోలు చేశారు. TG9 GT/ R4874 అనే నెంబర్ కలిగిన ఈ కారు రిజిస్ట్రేషన్ పనుల కోసం ఆయన ఖైరతాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన వస్తున్నారు అని మీడియాకి సమాచారం అందడం.. వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చేయడం జరిగింది. ఆర్.టి.ఓ ఆఫీస్ కి వచ్చిన మిగిలిన జనాలు ఇబ్బంది పడకుండా వెంటనే నాగార్జున.. అధికారుల ఆఫీస్లోకి వెళ్ళిపోయారు. అక్కడ పనులు ముగించుకున్న తర్వాత కాసేపు మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Nagarjuna

ఇక నాగార్జున కొత్త కారు విషయానికి వస్తే.. దాని పేరు టయోటా లెక్సస్ అని తెలుస్తుంది. దీని ధర రూ.2.10 కోట్లు అని సమాచారం. బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేశారు. టాలీవుడ్ హీరోల్లో ఈ కారును కొనుగోలు చేసిన మొదటి హీరోగా నాగార్జున నిలిచారు.

ఇది మాత్రమే కాదు. నాగార్జున గరాజ్లో ఇంకా చాలా కార్లు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

బీఎండబ్ల్యూ 7 సిరీస్(BMW 7 సిరీస్) : దీని ధర రూ.1.85 కోట్లు

ఆడి ఏ 7 : దీని ధర రూ.90.50 లక్షలు

టయోటా వెల్ ఫైర్ : దీని ధర రూ.1.32 కోట్లు

నిస్సాన్ జి టి-ఆర్ : దీని ధర రూ.2 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ : దీని ధర రూ.2 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 450 : దీని ధర రూ.2.2 కోట్లు

కియా మోటార్స్ వారి ఈవీ 6 ఎలక్ట్రిక్ కార్ : దీని ధర రూ.60.95 లక్షలు

‘మనం’ సినిమాలో నాగార్జున పోషించిన సీతారాముడు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో కూడా నాగార్జునకి కార్లంటే వ్యామోహం ఎక్కువ. నిజజీవితంలో కూడా నాగ్ అంతే.. అతని కార్ల కలెక్షన్ ను బట్టి చెప్పొచ్చు.

అల్లరి నరేష్ ఊర మాస్ అవతార్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus