Nagarjuna: రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన నాగ్.. ఆ హీరోలను మించి?

  • August 31, 2024 / 10:04 AM IST

స్టార్ హీరో అక్కినేని నాగార్జున  (Nagarjuna)  సోలో హీరోగా నటించిన సినిమాలలో చాలా సినిమాలు కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinni Nayana) , ఊపిరి (Oopiri) సినిమాల తర్వాత ఆ రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా లేదనే చెప్పాలి. బంగార్రాజు (Bangarraju) , నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాలు హిట్టైనా ఆ సినిమాలు కమర్షియల్ గా మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నాగ్ పారితోషికం 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాగ్ తన పారితోషికాన్ని దాదాపుగా డబుల్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Nagarjuna

కూలీ (Coolie) సినిమాకు నాగ్ పారితోషికం ఏకంగా 24 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో నాగ్ ఈ రేంజ్ లో డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలామంది మిడిల్ రేంజ్ హీరోలతో పోల్చి చూస్తే నాగ్ రెమ్యునరేషన్ ఎక్కువ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

కూలీ మూవీ సక్సెస్ సాధిస్తే నాగ్ ఇదే తరహా పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కుబేర సినిమాకు సైతం నాగ్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలుస్తోంది. నాగార్జునకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. కూలీ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా 2025లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

నాగార్జున సోలో హీరోగా కంటే ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కూలీ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

బాలయ్య కొన్ని సీన్లకు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus