Balakrishna: బాలయ్య కొన్ని సీన్లకు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఇవే!

నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో ఒకరు. బాలయ్య నట ప్రస్థానానికి నేటితో 50 సంవత్సరాలు పూర్తైంది. బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బాలయ్యకు మాత్రమే సొంతమైన, సాధ్యమైన కొన్ని రేర్ రికార్డులు ఉన్నాయి. బాలయ్య తాతమ్మ కల సినిమాతో తెరంగేట్రం చేయగా తొలిసారి హీరోగా సాహసమే జీవితం సినిమాలో నటించారు.

Balakrishna

ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్ లో బాలయ్య నటిస్తుండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్, బయోపిక్, సాంఘికం, జానపదం, పౌరాణికం ఇలా దాదాపుగా అన్ని జానర్ల సినిమాలలో నటించిన టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య మాత్రమే కావడం గమనార్హం. ఈ రికార్డ్ బాలయ్యకే సొంతమని చెప్పవచ్చు 1987 సంవత్సరంలో బాలయ్య నటించిన 8 సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి.

17 సినిమాలలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య అధినాయకుడు సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో బాలయ్య ఏకంగా 13 సినిమాలలో నటించారు. చంఘీజ్ ఖాన్, రామానుజాచార్య, గోన గన్నారెడ్డి పాత్రల్లో నటించాలని భావిస్తున్న బాలయ్య భవిష్యత్తులో ఈ పాత్రల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

పెద్దన్నయ్య (Peddannayya) మూవీ క్లైమాక్స్ కు, గౌతమీపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni) సినిమాలోని కొన్ని సీన్లకు బాలయ్య దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. బాలయ్య ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో స్క్రిప్ట్ సిద్ధం చేయగా మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కాలని కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

అక్కడ ఇప్పటికీ ‘సాహో’ నే హైయెస్ట్.. కానీ ‘పుష్ప’ గ్రేట్ అంటారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus