ప్రస్తుతం.. బయోపిక్ ల జోరు ఊపందుకుంది. ఇప్పటికే సావిత్రి ఆధారంగా ‘మహానటి’ రూపొంది సంచలన విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ విడుదలయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రెండవ భాగమైన ‘ఎన్టీఆర్- మహానాయకుడు’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు ‘వై.ఎస్.ఆర్. బయోపిక్’ అయిన యాత్ర చిత్రం కూడా ఫిబ్రవరిలోనే విడుదల కానుంది.
ఇదిలా ఉండగా.. ఎప్పుడైతే ‘ఎన్టీఆర్ బయోపిక్’ కి సన్నాహాలు మొదలయ్యాయో.. అప్పుడే ‘ఏఎన్నార్ బయోపిక్’ కి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. ఈ విషయమై ఎన్నో ప్రశ్నలు నాగార్జునకి ఎదురయ్యాయట. ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయినందువల్ల… ఆయన జీవితంలో ట్రాజెడీ ఏమీ లేకపోగా… డ్రామాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తిప్పి కొట్టే అవకాశం కూడా ఉందని నాగార్జున ఆలోచించారట. అయితే ఈ విషయంలో నాగార్జున తన ఆలోచన మార్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా జయాపజయాలు, కలెక్షన్ల.. విషయాలు.. అటుంచితే… తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత సంఘటనలు.. అందిస్తే బాగుంటుందని నాగ్ భావిస్తున్నాడట. దీనికోసం తాజాగా నాగార్జున తన కుటుంబ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే అక్కినేని కుటుంబం నుండీ నాగ చైతన్య, సుమంత్ లు ‘ఏఎన్నార్’ క్యారెక్టర్లు చేసారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గా ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో నటించిన సుమంత్ కు మంచి స్పందన లభించింది. సో ఈ ‘ఏఎన్నార్ బయోపిక్’ లో సుమంత్ మరో మారు తన తాత పాత్రలో నటించే అవకాశం ఉందంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు