Nagarjuna: బిగ్ బాస్ 8: అభయ్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా వదల్లేదుగా..!

‘బిగ్‌బాస్ 8’ : 3 వారాలు సక్సెస్ఫుల్ గా ముగిసింది. మూడవ ఆదివారం నాడు నాగార్జున (Nagarjuna) హౌస్మేట్స్ తో ఫన్ గేమ్స్ ఆడించాడు. అనంతరం నామినేషన్స్ లో ఉన్న పృథ్వీ (Prithviraj) , అభయ్(Abhay Naveen)  ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు ‘బిగ్ బాస్’. ఆ ప్లేస్లో ఎవరి కాళ్ల కింద అయితే రెడ్ లైట్ వెలుగుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు అని నాగార్జున చెప్పాడు. అభయ్ కాళ్ళ కింద రెడ్ లైట్ వెలగడంతో అతను ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు.

Nagarjuna

ఏడుస్తూనే అభయ్ ని సాగనంపారు. ఇక స్టేజిపైకి వచ్చి నాగార్జునని కలుసుకున్న అభయ్..కి నాగార్జున అతని జర్నీని చూపించాడు. మరోపక్క అభయ్ కి మళ్ళీ క్లాస్ పీకాడు నాగార్జున. ‘జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో అభయ్… మనలో ఎంత టాలెంట్ ఉన్నా.. మనల్ని అభిమానించే ఆడియన్స్… మన బిహేవియర్ చూసే ఓటేస్తారు’ అంటూ అభయ్ కి చెప్పాడు నాగార్జున. దీనికి అభయ్.. ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి.. వేరే దానికి బోర్డర్ ఉంటుంది.

దాన్ని దాటకూడదు అని అందరికీ నేను చెప్పి.. ఇప్పుడు నేనే దాన్ని క్రాస్ చేశాను. సో నేను అనుభవించాల్సిందే’ అంటూ పశ్చాత్తాపపడ్డాడు. శనివారం ఎపిసోడ్లో అయితే అభయ్ పై నాగార్జున ఓ రేంజ్లో మండిపడ్డ సంగతి తెలిసిందే. ‘ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఆయన పెట్టిన రూల్స్ అందరూ పాటించాల్సిందే, నాతో సహా..! ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే హౌస్ నుండి బయటకు వెళ్లిపోవచ్చు.

అభయ్ నీకు రెడ్ కార్డు ఇష్యు అవ్వడం వల్ల.. ఇప్పుడే నువ్వు హౌస్లో నుండి బయటకు వచ్చెయ్యి. బిగ్ బాస్ డెసిషన్ ఈజ్ ఫైనల్’ అంటూ శివాలెత్తిపోయాడు నాగ్. ‘బిగ్ బాస్ కి దిమాక్ లేదు, జోక్స్ కి కూడా ఫీలవుతావేంట్రా బిగ్ బాస్’ అంటూ అభయ్ అమర్యాదగా పలకడం వల్ల.. బిగ్ బాస్ యాజమాన్యం అతని పై సీరియస్ అయ్యి.. ఎలిమినేట్ చేశారు’ అంటూ అంతా భావిస్తున్నారు.

ఇన్నాళ్లూ కామ్‌ ఉంటే సైలెంట్‌ అనుకున్నారు.. వైలెంట్‌ రిప్లై ఇచ్చిందిగా!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus