Nagarjuna: ఎన్టీఆర్ లీవ్స్ ఆన్… ఎన్టీఆర్ పై నాగ్ కామెంట్స్ వైరల్!

అక్కినేని కుటుంబం గురించి నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాలకు కారణమయ్యాయో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో నందమూరి వర్సెస్ అక్కినేని అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. ఇక ఈ విషయం గురించి ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. ఏఎన్ఆర్ వర్ధంతి రోజున బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సిటీ సెలబ్రిటీల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కినేని అభిమానులు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపోతే మరికొందరు గతంలో ఎన్టీఆర్ గురించి నాగార్జున మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. గత ఏడాది నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన విషయం మనకు తెలిసిందే

అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటివారని తెలిపారు.ఎన్టీఆర్ లీవ్స్ ఆన్ ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ అంటూ ఇద్దరు నటుల గురించి నాగార్జున ఎంతో గొప్పగా మాట్లాడారు.

అయితే ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజున బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే గత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇద్దరికీ ఎంత తేడా ఉందో అంటూ అక్కినేని అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus