Nagarjuna: డైలాగ్స్ చెప్పడంలో ఆ హీరోనే తోపు అన్న నాగ్.. ఏం చెప్పారంటే?

  • May 26, 2024 / 09:31 PM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) ఈ ఏడాది నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నా సామిరంగ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచి మంచి లాభాలను సొంతం చేసుకుంది. అయితే నాగార్జున సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే నాగార్జున నుంచి ప్రశంసలు అందుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి ఒక సందర్భంలో నాగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ ను ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ (Amitabh Bachchan) తో పోల్చడం గమనార్హం. డైలాగ్స్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ తోపు అనే అర్థం వచ్చేలా నాగ్ కామెంట్లు చేశారు. తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎన్టీఆర్ పేరు చెబుతూ నాగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ ను కింగ్ నాగార్జున తెగ మెచ్చుకోవడం గమనార్హం.

డైలాగ్ ఎంత పెద్దదైనా ఎన్ని పేజీలున్నా అలవోకగా చెప్పే ప్రతిభ తారక్ సొంతమని నాగ్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లో స్పష్టత, భావంతో పాటు ఆ డైలాగ్ తీవ్రతను సైతం పూర్తిస్థాయి స్పష్టతతో పలికిస్తారని నాగార్జున వెల్లడించడం గమనార్హం. కొంతమంది మాత్రమే డైలాగ్ లతో సీన్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తారని బాలీవుడ్ లో అమితాబ్ కు ఈ లక్షణం ఉంటే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఈ లక్షణం ఉందని కింగ్ అక్కినేని నాగార్జున అన్నారు.

కింగ్ నాగార్జున ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పాలి. నాగార్జున సినిమాలకు, పాత్రల నిడివికి అనుగుణంగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా ఒకింత టాప్ లో ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus