తెలుగు సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖర్చు తగ్గించుకోవడం చాలా అవసరం అని పరిశ్రమ వర్గాలు చాలా రోజుల నుండి అంటున్నాయి. అగ్ర హీరోలు కూడా ఇదే తరహాలో గతంలో కొన్నిసార్లు మాట్లాడారు. తాజాగా ‘బంగార్రాజు’ కోసం నాగార్జున అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాలు, పాట కోసం ముందుగా అనుకున్న దాని కంటే ఖర్చు తగ్గించే పనిలో పడ్డారని టాక్. ‘బంగార్రాజు’ కోసం స్వర్గ లోకం సెగ్మంట్ ఒకటి రాసుకున్నారట దర్శకరచయితలు.
దీన్ని తెరకెక్కించడానికి రంభ, ఊర్వశి, మేనక పాత్రల కోసం హీరోయిన్లను ఎంపిక చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి చిన్న పాత్రలైనా స్టార్ హీరోయిన్లను తీసుకొస్తుంటారు నాగార్జున. ఆయన గత సినిమాలు చూస్తే ఈ విషయం తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగ్ ఆలోచన మారిందట. సినిమా కాస్ట్ కటింగ్ కోసమో, ఇంకెందుకో గానీ… ముగ్గురు యువ నాయికలను తీసుకొంటున్నారట. సినిమా కథ అనుకుంటున్నప్పుడు, ప్రి ప్రొడక్షన్ టైమ్లో రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో ఎవరిని అనుకున్నారో తెలియదు కానీ…
ఇప్పుడు మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక లాంటి యువ నాయికల్ని తీసుకున్నారట. త్వరలో వారిపై చిత్రీకరణ జరుగుతుందని టాక్. అయితే ఈ ముగ్గురూ ఆ పాత్రల్లో ఎంతమేరకు ఆకట్టుకుంటారు అనేది చూడాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!