వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మాస్ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నటుడు నాగార్జున. ఈయన పుట్టినరోజు సందర్భంగా నా సామి రంగ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని తెలియజేయడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కనుక చూస్తే అల్లు అర్జున్ పూర్తి మాస్ లుక్ లో ఉండటమే కాకుండా ఈ సినిమా ద్వారా భారీ హిట్ అందుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇకపోతే నాగార్జున (Nagarjuna) నటిస్తున్నటువంటి ఈ సినిమా మలయాళంలో వచ్చిన పోరింజు మరియం జోస్ అనే సినిమాకు రీమేక్ సినిమా అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొన్నటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇక నాగార్జున ఈ సినిమాని ప్రకటించిన తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియోల నుంచి ఈ సినిమాని డిలీట్ చేయించారంటూ వార్త వైరల్ గా మారింది..
రీమేక్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముందుగా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తారు ఆ సినిమాని చూసిన తర్వాత తిరిగి ఈ సినిమాలను చూడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నాగార్జున తన సినిమాను ప్రకటించడంతో ఒరిజినల్ సినిమాని డిలీట్ చేయించారని తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఉద్దేశంలో నాగార్జున ఉన్నారని అందుకే ఈ సినిమాని డిలీట్ చేయించారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం పచ్చ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఆయన నాగార్జున సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.