Nagarjuna: ఎవరు చూడకూడదని ఆ సినిమాని డిలీట్ చేయించిన నాగార్జున… ఏమైందంటే?

వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మాస్ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నటుడు నాగార్జున. ఈయన పుట్టినరోజు సందర్భంగా నా సామి రంగ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని తెలియజేయడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కనుక చూస్తే అల్లు అర్జున్ పూర్తి మాస్ లుక్ లో ఉండటమే కాకుండా ఈ సినిమా ద్వారా భారీ హిట్ అందుకోబోతున్నారని తెలుస్తుంది.

ఇకపోతే నాగార్జున  (Nagarjuna) నటిస్తున్నటువంటి ఈ సినిమా మలయాళంలో వచ్చిన పోరింజు మరియం జోస్ అనే సినిమాకు రీమేక్ సినిమా అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొన్నటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇక నాగార్జున ఈ సినిమాని ప్రకటించిన తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియోల నుంచి ఈ సినిమాని డిలీట్ చేయించారంటూ వార్త వైరల్ గా మారింది..

రీమేక్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముందుగా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తారు ఆ సినిమాని చూసిన తర్వాత తిరిగి ఈ సినిమాలను చూడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నాగార్జున తన సినిమాను ప్రకటించడంతో ఒరిజినల్ సినిమాని డిలీట్ చేయించారని తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఉద్దేశంలో నాగార్జున ఉన్నారని అందుకే ఈ సినిమాని డిలీట్ చేయించారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం పచ్చ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారా ఆయన నాగార్జున సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus